NTV Telugu Site icon

‘లార్డ్స్‌’లో భారత ఘనవిజయం

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఇంగ్గండ్‌పై గెలుపొందింది. దీంతో ఐదు టెస్ట్ల్‌ల సీరిస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా. 298 పరుగులకు గాను….8వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ….120 లకే ఆలౌటయ్యింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ, బుమ్రా బ్యాటింగ్‌లో అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా… బుమ్రా మూడు, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.