ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ ఓటమి ఎరుగని జట్టుగా సత్తాచాటుతూ.. టైటిల్ ను కైవసం చేసుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీం ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 19 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక ఇప్పుడు నెక్ట్స్ ప్లాన్ ఏంటీ? టీమిండియా ఏ సిరీస్ అడబోతోంది? అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
Also Read:Balochistan: బలూచిస్తాన్ స్వాతంత్రం తప్పదా?.. పట్టుకోల్పోతున్న పాకిస్తాన్.. అసలేంటి ఈ వివాదం..
2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత భారత జట్టుతో పాటు సహాయక సిబ్బంది కూడా సుదీర్ఘ విశ్రాంతి తీసుకోబోతున్నారు. రాబోయే 4 నెలలు టీం ఇండియా ఎలాంటి సిరీస్‌లు ఆడబోదు. కానీ, మరికొన్ని రోజుల్లో IPL 2025 ప్రారంభంకాబోతోంది. ఇందులో టీమిండియా ప్లేయర్స్ పాల్గొననున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Also Read:AP DGP: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం..
IPL 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగనున్నది. టెస్ట్ సిరీస్ జూన్ 20న ప్రారంభమై ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి జూన్ 24 వరకు లీడ్స్‌లోని హెడింగ్లీలో జరుగుతుంది. రెండవ టెస్ట్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో, మూడవ టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్‌లో, నాల్గవ టెస్ట్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో, చివరి టెస్ట్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఈ ఏడాది ఏ సిరీస్ ఆడదు.