NTV Telugu Site icon

ఒలింపిక్స్.. ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు

PV Sindhu

PV Sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్‌లో అడుగుపెట్టింది తెలుగుతేజం, భారత ఏస్ ష‌ట్లర్ పీవీ సింధు.. కాసేపటి క్రితం మహిళల సింగిల్స్‌లో జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన సింధు.. ప్రిక్వార్టర్‌కు చేరుకున్నారు.. ఆ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గ‌న్ యితో తలపడిన ఆమె.. 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిపొందారు.. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం పీవీ సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘ‌ట‌న తప్పలేదు.. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో మెల్లగా పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధిస్తూ.. విజయానికి చేరువైంది.. ఈ విజయంతో గ్రూప్ జే టాప‌ర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది పీవీ సింధు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది సింధు.