Site icon NTV Telugu

రిజ్వాన్ కు వైద్యం చేసిన భారత డాక్టర్ ఇతనే…!

ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌ లో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆ జట్టు తరపున మొహమ్మద్ రిజ్వాన్‌ అత్యధికంగా 67 పరుగులు చేసాడు. అయితే ఈ మ్యాచ్ కు ఒకరోజు ముందు ఈ పాకిస్థాన్ క్రికెటర్ ఐసీయూలో ఉన్నాడు. ఆ సమయంలో అతనికి వైద్యం చేసింది ఓ భారత వైద్యుడు. ఐసీయూలో తీవ్రమైన ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ తో పోరాడిన ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ స్ఫూర్తిని మరియు ధైర్యాన్ని ప్రశంసించాడు భారత డాక్టర్ సాహీర్ సైనాలాబ్దీన్. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో రిజ్వాన్ తన దేశం తరపున ఆడాలనే బలమైన కోరికతో… దృఢ నిశ్చయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతను కోలుకున్న వేగం చూసి నేను ఆశ్చర్యపోయాను” అని సాహీర్ గుర్తు చేసుకున్నాడు. ఇక ఆసుపత్రి నుండి వచ్చే సమయంలో సాహీర్ ను రిజ్వాన్ తన జెర్సీను గిఫ్ట్ గా ఇచ్చాడు.

Exit mobile version