India Will Create New Record In They Win WTC Finals: జూన్ 7వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! లండన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇంతకుముందు ఫైనల్స్‌లో న్యూజీల్యాండ్ చేతిలో పరాజయం చవిచూసిన టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్స్‌లో నెగ్గాలని భావిస్తోంది. ఆల్రెడీ స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. అదే జోరును ఫైనల్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. అటు.. ఆస్ట్రేలియా కూడా తగ్గేదే లే అన్నట్టుగా కసరత్తు చేస్తోంది.
Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. తాను క్యాన్సర్ తో పోరాడాను అని ఒప్పుకున్న చిరు
అయితే.. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మాత్రం, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంటుంది. వన్డే, టీ20, టెస్టు.. ఈ మూడు ఫార్మాట్లలోనూ వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు భారత జట్టు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే! తొలుత కపిద్ దేవ్ నాయకత్వంలో 1983లో వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిస్తే.. టెస్టుల్లోనూ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి, మూడు ఫార్మాట్‌లలో ఛాంపియన్స్‌గా నిలిచిన మొదటి జట్టుగా నిలుస్తుంది. అటు.. మరోవైపు.. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచినా, అదే రికార్డ్‌ని సొంతం చేసుకుంటుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్ (సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్‌లు సబ్‌స్టిట్యూట్స్)
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.