లార్డ్స్ టెస్టులో చరిత్రాత్మక విజయంతో ఆధిక్యం దక్కించుకున్న టీమ్‌ఇండియా మూడో టెస్టులో ఆదిలోనే కోలుకోలేని దెబ్బతిన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కోహ్లీ నిర్ణయం బెడిసికొట్టింది. లార్డ్స్ టెస్టు ఓటమితో కసి మీదున్న ఇంగ్లండ్ పేసర్లు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.దీంతో టీమ్‌ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే చాపచుట్టింది. కోహ్లీసేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్..బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
బౌలింగ్‌లోనూ చేతులెత్తేసిన ఇండియా…ఆధిక్యం లో ఇంగ్లండ్
