India vs England 3rd ODI Match Time and Live Streaming: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది. మొదటి మ్యాచ్ భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దాంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. దాంతో అందరి కళ్లు చివరి మ్యాచ్ పైనే ఉన్నాయి. సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై జరుగుతుంది కాబట్టి మూడో వన్డే మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
మధ్యాహం 3.30కి మ్యాచ్ ఆరంభం:
మూడు వన్డేల సిరీస్ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతోంది. కాబట్టి మ్యాచ్ సమయాల్లో మార్పులు ఉంటున్నాయి. మొదటి వన్డే మధ్యాహం 3.30కి స్టార్ట్ కాగా.. రెండో వన్డే సాయంత్రం 5.30కి మొదలయింది. జులై 19 భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం మధ్యాహం 3.30కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. టాస్ మధ్యాహం 3 గంటలకు వేయనున్నారు. ఇండియాలో అయితే సాధారణంగా వన్డే మ్యాచ్ మధ్యాహం 2.30కి ఆరంభం అవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్:
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే మూడో వన్డేను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. అలానే ఈ వన్డే మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.
పిచ్ రిపోర్ట్:
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు సహకరిస్తుంది. కొత్త బంతితో స్వింగ్, బౌన్స్ లభిస్తాయి. ఈ పిచ్‌పై స్పిన్నర్ల పాత్ర పరిమితంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు మెరుగుపడతాయి.
వన్డేల్లో ముఖాముఖి రికార్డు
వన్డేల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు మొత్తంగా 112 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 62 మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ 45 మ్యాచ్‌లలో గెలిచింది. 5 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.

