IND vs ENG 1st T20 Live Streaming: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఈసారి టెస్ట్ మ్యాచ్‌లు లేకపోవడం విశేషం. ఐర్లాండ్‌పై ఎదురైన పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఈ సిరీస్‌లో బలంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో అరంగేట్రం దక్కుతుందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇంగ్లండ్ జట్టు కూడా హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్.. స్వదేశంలో భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్, భారత్ తొలి టీ20 నేడే జరగనుంది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు మొదటి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్ నేపథ్యంలో షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
భారత్-ఇంగ్లండ్ 2026 పూర్తి షెడ్యూల్:
టీ20 సిరీస్:
జూలై 1: తొలి టీ20 – రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లీ-స్ట్రీట్ (రాత్రి 10:00 IST)
జూలై 4: రెండో టీ20 – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (సాయంత్రం 7:00 IST)
జూలై 7: మూడో టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ (రాత్రి 10:00 IST)
జూలై 9: నాలుగో టీ20 – సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్ (రాత్రి 10:00 IST)
జూలై 11: ఐదో టీ20 – యుటిలిటా బౌల్, సౌతాంప్టన్ (సాయంత్రం 7:00 IST)
వన్డే సిరీస్:
జూలై 14: తొలి వన్డే – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (సాయంత్రం 5:30 IST)
జూలై 16: రెండో వన్డే – సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ (సాయంత్రం 5:30 IST)
జూలై 19: మూడో వన్డే – లార్డ్స్, లండన్ (మధ్యాహ్నం 3:30 IST)
భారత్ జట్లు:
టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
ఇంగ్లండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?:
భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కు ఉన్నాయి. టెలివిజన్‌లో సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లో అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

