Site icon NTV Telugu

అండర్ 19లో భారత జట్టు విజయ పరంపర

అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. కూలీస్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ , కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్ అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకు పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే పెవిలియన్ చేరింది.

అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన టీంగా భారత్ జట్టు రికార్డు సృష్టించింది. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 తర్వాత ఈ ఏడాది కూడా టీమ్‌ఇండియా ఫైనల్‌ టిక్కెట్‌ దక్కించుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ కూడా గెలుచుకోగలిగింది. 2000, 2008, 2012, 2018లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచింది. ఈసారి ఫైనల్లో ఇంగ్లండ్‌ ను టీమిండియా ఢీ కొట్టనుంది.

Exit mobile version