న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని సెలక్టర్లు తెలిపారు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు.
జట్టు: ఆజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జయంత్ యాదవ్
