Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, అలాగే ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్లను ప్రకటించింది. ఈ ఎంపికలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ వన్డే జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా జట్టులో ఉన్నారు.
శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంపిక అతని ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, సోమవారం బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్ మ్యాచ్‌లు జూలై 14న ఎడ్జ్‌బాస్టన్, జూలై 16న సోఫియా గార్డెన్స్, జూలై 19న లార్డ్స్ మైదానాల్లో జరగనున్నాయి.
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
కోహ్లీ రికార్డుపై కన్ను..
ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్ లో 54 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ సిరీస్ లో ఒక్క సెంచరీ అయినా చేయకపోతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా కోహ్లీ 85 సెంచరీలతో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన జాబితాల్లో సచిన్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు.. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం BCCI అప్డేట్ చేసిన జట్టును విడుదల చేసింది. ఐపీఎల్ 2026లో ఎడమ కాలికి గాయమై, ప్రస్తుతం పునరావాసంలో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
ఇంగ్లాండ్ వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
ఐర్లాండ్ టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!