KL Rahul: రాహుల్ పెళ్లి.. ధోనీ, కోహ్లీ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురైన తన ప్రేయసి, నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. సునీల్ శెట్టికి చెందిన అత్యంత విలాసవంతమైన ఖండాల ఫామ్ హౌస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అటు సునీల్ శెట్టికి అత్యంత సన్నిహితంగా ఉండే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో పాటు రాహుల్ సహచర ఆటగాళ్లు అయిన వరుణ్ ఆరోన్, ఉమేశ్ యాదవ్‌లు పెళ్లికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు దూరంగా పెళ్లి చేసుకున్న రాహుల్-అతియాలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నారు. కాగా ఈ నూతన వధూవరులకు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ అనంతరం సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని రాహుల్-అతియా భావిస్తున్నారు.
Facebook Down: అమెరికాలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ డౌన్..
Also Read
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
అయితే, రాహుల్ పెళ్లికి హాజరు కాకపోయినా.. టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు భారీ బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు క్రికెటర్లతో పాటు కుటుంబ సన్నిహితులు, సినీ ప్రముఖులు ఖరీదైన బహుమతులు అందజేశారట. మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన కవాసకి నింజా బైక్‌ను రాహుల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.80 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడట. కట్నం కింద ముంబైలోని రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను సునీల్ శెట్టి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే జాకీ ష్రాఫ్-రూ.30 లక్షల విలువైన వాచ్, సల్మాన్ ఖాన్ రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారు, అర్జున్ కపూర్- రూ.1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్‌లెట్ వధూవరులకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!