NTV Telugu Site icon

క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్ ఇంట విషాదం

Kiran Pal Singh

టీమిండియా క్రికెట‌ర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెల‌కొంది… భువ‌నేశ్వ‌ర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. ఇవాళ క‌న్నుమూశారు.. 63 సంవత్సరాల కిర‌ణ్ పాల్ సింగ్.. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు.. నోయిడాలో కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కానీ, ఈరోజు మీరట్‌లోని తన నివాసంలో కన్నుమూశారు కిర‌ణ్ పాల్.. ఇక‌, కాలేయ సంబంధ సమస్యలు కూడా ఆయ‌న‌ను వేధించిన‌ట్టు చెబుతున్నారు.. యూపీ పోలీస్‌ శాఖలో ఎస్సైగా పనిచేసిన ఆయ‌న‌.. వీఆర్ఎస్ తీసుకున్నారు.. కానీ, గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబర్‌లో కేన్సర్ బారిన‌ప‌డ్డారు. మ‌రోవైపు.. రెండు వారాల క్రితం కిర‌ణ్ పాల్ ఆరోగ్యం విష‌మించ‌డంతో మీరట్ గంగానగర్‌లోని హాస్పిట‌ల్‌కు త‌రించారు.. కోలుకోవ‌డంతో.. ఆస్ప‌త్రి నుంచి ఇంటికి పంపించ‌గా.. రెండు రోజుల‌కే ఆయ‌న క‌న్నుమూశారు.