Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 26 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 9 స్వర్ణాలు, 8రజతాలు, 9 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా… అన్షు మలిక్ రజతం… దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. ఇవాళ కూడా పలు క్రీడల్లో భారత్‌కు చెందిన అథ్లెట్లు పాల్గొననున్నారు. మరి ఇవాళ ఏయే విభాగాల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారో తెలుసుకుందాం.
బాక్సింగ్ (సెమీస్): అమిత్ పంగల్ (సా.3.30 గంటల నుంచి); నిఖత్ జరీన్ (రా.7.15 గంటల నుంచి)
క్రికెట్: మహిళల సెమీస్, భారత్ × ఇంగ్లాండ్ (మ.3.30 గంటల నుంచి)
అథ్లెటిక్స్: మంజు బాల, మహిళల హ్యామర్‌త్రో ఫైనల్ (రా.11.30 గంటల నుంచి); మహిళల 4×100 మీ రిలే, హిమదాస్, ద్యుతిచంద్, శర్బాని, సిమి (సా.4.45 నుంచి)
హాకీ: పురుషుల సెమీస్, భారత్ × దక్షిణాఫ్రికా (రా.10.30 నుంచి)
టేబుల్ టెన్నిస్: శ్రీజ-శరత్‌కమల్, మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ (సా.6 నుంచి)
రెజ్లింగ్ (సా.3 నుంచి): వినేశ్ ఫొగాట్; రవికుమార్ దహియా; పూజ గెహ్లాట్; దీపక్