Site icon NTV Telugu

టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ రిటైర్‌మెంట్‌

టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు .. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడే స్టువర్ట్ బిన్నీ. రెండుసార్లు రంజీ ట్రోఫీ విజేత కూడా. 37 ఏళ్ల బిన్నీ భారత్ తరపున 23 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో ఆరు టెస్టులు, 14 వన్డేలు, రెండు టీ20లు ఉన్నాయి. అతడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ 17 ఏళ్ల సుదీర్ఘ సమయం పాటు కొనసాగింది.

Exit mobile version