IND vs NZ: న్యూజిలాండ్ జట్టు జనవరి 11వ తేదీ నుంచి భారత్‌లో పర్యటించబోతుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, 5 టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్- కివిస్ మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కీలక ప్రకటన చేసింది. జనవరి 18వ తేదీన ఇండోర్‌లోని ప్రసిద్ధ హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో వన్డే మ్యాచ్ టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ 2026 సంవత్సరంలో భారత్ జట్టు ఆడే తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌కు ముగింపు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాగా, ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లు వడోదర, రాజ్‌కోట్‌లలో జరగనుండగా, ఇండోర్‌లో జరిగే మూడో వన్డే డే-నైట్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ సౌకర్యాలను MPCA అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Also: Smriti Mandhana: 45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!
విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు..
ఈస్ట్ స్టాండ్ లోయర్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో విద్యార్థుల కోసం పరిమిత సంఖ్యలో రాయితీ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఈస్ట్ స్టాండ్ (లోయర్): రూ.750
ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.950
అయితే, ప్రతి విద్యార్థికి ఒక్క టికెట్ మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసి, చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ గుర్తింపు కార్డు లేదా అకడమిక్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొనింది. MPCA ధృవీకరణ తర్వాత వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ లింక్ పంపబడుతుంది.. రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31, 2025 ఉదయం 11 గంటల నుంచి జనవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు లేదా కోటా పూర్తయ్యే వరకు కొనసాగుతుంది అని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలియజేసింది.
Read Also: DGP Harish Kumar Gupta: గత ఏడాదితో పోలిస్తే… ఈ ఏడాది క్రైమ్ రేట్ బాగా తగ్గింది-డీజీపీ
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, దివ్యాంగుల కోసం నార్త్-ఈస్ట్ గ్యాలరీలో రూ.300 ధరతో ప్రత్యేక టికెట్లను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కేటాయించింది. ప్రభుత్వ జారీ చేసిన వైకల్య సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయడం తప్పనిసరిగా చేసింది. వీల్‌చైర్ అవసరమైతే, వాటిని స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
సాధారణ టికెట్ల ధరలు
ఈ మ్యాచ్‌కు సాధారణ టికెట్లు రూ.800 నుంచి రూ.7,000 వరకు ఉన్నాయి. అన్ని రకాల టికెట్లు ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ అనే అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తారు.
టికెట్ ధరల వివరాలు:
సౌత్ పావిలియన్ (లోయర్): రూ.5,500
సౌత్ పావిలియన్ (ఫస్ట్ ఫ్లోర్): రూ.7,000
సౌత్ పావిలియన్ (సెకండ్ ఫ్లోర్): రూ.6,500
సౌత్ పావిలియన్ (థర్డ్ ఫ్లోర్): రూ.5,000
ఈస్ట్ స్టాండ్ (లోయర్ – చైర్స్): రూ.800
ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,250
ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,100
ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,000
వెస్ట్ స్టాండ్ (లోయర్ – చైర్స్): రూ.900
వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,500
వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,400
వెస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,250
అయితే, ఇండోర్ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. గాయాల నుంచి కోలుకుంటున్న శుభ్‌మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును జనవరి తొలి వారంలో బీసీసీఐ ప్రకటించనుంది. వన్డే సిరీస్ అనంతరం భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. కాగా, ఇది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు చివరి సిరీస్ కావడం విశేషం.
