NTV Telugu Site icon

వచ్చే ఏడాది మార్చిలో ఇండియా – పాక్ మ్యాచ్…

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క షెడ్యూల్‌ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. ఇక ఇందులో టీం ఇండియా తమ మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుతో మార్చి 6న తలపడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది రెండు దేశాల అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఈ టోర్నమెంట్ మొదట లీగ్ ఫార్మాట్‌ లో మొత్తం ఎనిమిది జట్లు ఆడతాయి. ఆ తర్వాత మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ కు అర్హత సాధిస్తాయి. మార్చి 30న మొదటి సెమీ-ఫైనల్ జరగనుండగా, మార్చి 31న రెండో సెమీ-ఫైనల్‌ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3న ఈ టోర్నీ ఫైనల్స్ ఉండనున్నట్లు ఐసీసీ ప్రకరించింది. అయితే సెమీ-ఫైనల్ మరియు ఫైనల్స్ రెండింటికీ రిజర్వ్ డే ఉంటుంది.