Site icon NTV Telugu

మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్

టీమిండియాతో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట‌లో ఈ ఇంగ్లీష్‌ పేసర్‌ గాయ‌ప‌డ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అత‌డు కోలుకుంటాడ‌ని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేక‌పోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇది ఇలా ఉండగా.. రేపు జరిగే మ్యాచ్ లో టీం ఇండియా లోనూ భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ సారి పుజారా బర్త్ పై అందరిలోనూ సందేహలున్నాయి. పుజారా స్థానం లో సూర్య కుమార్ యాదవ్ ను ఆడించాలని సీనియర్ల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

Exit mobile version