Site icon NTV Telugu

Asia Cup: పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్

India Vs Pakitan Betting

India Vs Pakitan Betting

Huge Bettings On India vs Pakistan Match In Asia Cup 2022: సాధారణంగానే క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే.. బెట్టింగ్స్ జోరు మామూలుగా ఉండదు. ఆ మ్యాచ్‌కి ఉండే క్రేజ్ అలాంటిది. అదొక హైఓల్టేజ్ మూమెంట్. చిన్న – పెద్ద, జాతి – వర్గ, దేశీ – విదేశీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. అందుకే, ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోతుంటారు. ఇప్పుడు ఆసియా కప్-2022లో భాగంగా ఈరోజు దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తోంది. మొదటి బంతి దగ్గర నుంచి మ్యాచ్ గెలుపు దాకా.. ప్రతీ అంశంపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి.

పాకిస్థాన్ జట్టుపై రూ.1000 బెట్టింగ్ వేస్తే.. రూ. 2800 అందుతాయి. ఒకవేళ ఆ జట్టు మ్యాచ్ గెలిస్తేనే! అదే భారత్ విషయానికి వచ్చేసరికి.. రూ. 1450 మాత్రమే అందుతాయి. భారత్ ఎలాగో గెలుస్తుందన్న ధీమాతోనే తక్కువ ఫిగర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ భారత్ టాస్‌తో పాటు మ్యాచ్ విన్ అయితే.. రూ. 1 వెయ్యికి గాను రూ. 6000 దక్కుతాయి. పాకిస్తాన్ మేటర్‌లో మాత్రం ఆ విన్నింగ్ ఫిగర్ కొంచెం తక్కువే ఉంది. రూ. 5000 వరకూ అందుతాయంతే! అంటే.. ఒక వెయ్యి రూపాయలు తక్కువన్నమాట! అలా కాకుండా పాకిస్తాన్ టాస్ విన్ అయి, మ్యాచ్ ఇండియా గెలిస్తే.. రూ. 1000 కి రూ. 2750 వస్తుంది. టాస్‌తో సంబంధం లేకుండా కేవలం మ్యాచ్ ఫలితం మీదే బెట్టింగ్ వేస్తే.. మరో అమౌంట్ ఉంటుంది. అంటే.. కేవలం ఇండియా గెలుస్తుందని రూ. 1000 బెట్టింగ్ వేస్తే, రూ. 2500 దాకా ఖాతాలోకి వస్తాయన్నమాట!

ఇంతేకాదండోయ్.. ఇంకా చాలా కేటగిరీలు ఉన్నాయి. ఏ ప్లేయర్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? టాప్ స్కోరర్‌గా ఎవరు నిలుస్తాడు? అత్యధిక వికెట్లు ఎవరు తీస్తారు? ఏ ఓవర్‌లో ఎన్ని రన్స్ వస్తాయని బెట్టింగ్‌లు కడుతున్నాయి. అంతటితో ఆగడం లేదు.. ఏ బంతికి, ఎలాంటి ఫలితం (సింగిల్, డబుల్, ఫోర్, సిక్స్, వైడ్, బై… ఎట్‌సెట్రా) వస్తుందన్న బాల్ టు బాల్ బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు.

Exit mobile version