Site icon NTV Telugu

హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్.. అజారుద్దీన్ పై వేటు

Azharuddin

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొన‌సాగుతూనే ఉండ‌గా.. తాజాగా కొత్త ట్విస్ట్ వ‌చ్చిచేరింది.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న‌ అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోప‌ణ‌లు ఉండ‌గా.. మ‌రోవైపు అజారుద్దీన్‌పై కేసులు కూడా పెండింగ్ లో ఉన్నందున.. హెచ్‌సీఏ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్.. అయితే, తాజా ప‌రిణామాల‌పై అజార్ స్పందించాల్సి ఉంది.

Exit mobile version