NTV Telugu Site icon

కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడా? హర్ష గోయెంక ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్

97232405

97232405

హర్ష గోయెంక.. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఫన్నీ, వెటకార ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. కాగా మరోసారి గోయెంక చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ట్వీట్ నెటిజన్లను తికమకలోనూ పడేసింది. ఈసారి ఆయన చేసిన ట్వీట్ ఎవరి గురించో కాదు టీమిండియాలో డబుల్ సెంచరీ వీరులకు సంబంధించింది. భారత్-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో వన్డే తర్వాత స్కోర్ బోర్డును చూపిస్తూ గోయెంక ఈ ట్వీట్ చేశాడు.

విషయం ఏంటంటే.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట కివీస్‌ను 108 రన్స్‌కే ఆలౌట్ చేసిన రోహిత్‌సేన అనంతరం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యా్న్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ (51), గిల్ (40 నాటౌట్), కోహ్లీ (11), ఇషాన్ కిషన్ (8 నాటౌట్)కు మాత్రమే బ్యాటింగ్ అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన స్కోర్ బోర్డును ట్వీట్ చేసిన హర్ష.. “మీరు గమనించారా.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వారంతా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన వారే” అంటూ పోస్ట్ చేశాడు. దీనిని గమనించిన నెటిజన్లు రోహిత్, గిల్, ఇషాన్ సరే కానీ కోహ్లీ ఎప్పుడు డబుల్ సెంచరీ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్వీట్ చేసేముందు ఓసారి నిజాలు తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే వారి కామెంట్లకు రిప్లేగా హర్ష.. “కోహ్లీ సియెట్ బ్యాట్ యూజ్ చేయలేదు. అందుకే డబుల్ సెంచరీ చేయలేదు” అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు నిజమే కదా అంటూ హర్ష సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.

IAS Officer Case Update: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి.. డిప్యూటీ తహశీల్దార్ పై వేటు

మ్యాచ్ విషయానికి వస్తే రెండో వన్డేలో కివీస్‌ను చిత్తుచేసింది టీమిండియా. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను 34.3 ఓవర్లలో 108 రన్స్‌కే కట్టడి చేసింది. షమీ 3, పాండ్యా 2, సుందర్ 2 వికెట్లతో సత్తాచాటగా. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్‌తో రాణించారు. ఇక టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ (51), గిల్ (40 నాటౌట్) శుభారంభాన్నిచ్చారు. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో రెచ్చిపోగా గిల్ అతడికి సపోర్ట్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేశాక రోహిత్ ఔట్ కాగా కోహ్లీ (11) నిరాశ పర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8 నాటౌట్) గిల్‌తో కలిసి మ్యాచ్‌ ముగించేశాడు. దీంతో సిరీస్ 2-0 తేడాతో టీమిండియా వశమైంది. చివరిదైన నామమాత్రపు మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరగనుంది.