Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
- 2-1తో వన్డే సిరీస్ ఇంగ్లండ్ కైవసం
- టీ20 సిరీస్ 4-0తో ఇంగ్లండ్ సొంతం
- మ్యాచ్‌లో కీలక మలుపుగా బెతెల్ బౌలింగ్
- బ్రూక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Reveals England’s Winning Formula vs India: భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్‌లు హ్యారీ బ్రూక్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గెలిచింది. మూడో వన్డే అనంతరం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచ నంబర్‌వన్ వన్డే జట్టైన భారత్‌పై రెండు సిరీస్‌లు గెలవడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఆటగాళ్ల మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్, సమష్టి ప్రదర్శన, కచ్చితమైన ప్రణాళికలే విజయానికి ప్రధాన కారణాలని బ్రూక్ వెల్లడించాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బ్రూక్.. ‘ప్రపంచ నంబర్‌వన్ జట్టుపై సిరీస్ గెలవడం చాలా గర్వంగా ఉంది. ఆటగాళ్లంతా చివరి వరకు పోరాడారు. టీ20 సిరీస్‌లో ఎలా కమ్యూనికేట్ చేసుకున్నామో, ఈ సిరీస్‌లో కూడా అదే విధానాన్ని కొనసాగించాం. అందుకే ఈ విజయాన్ని సాధించగలిగాం. మా బ్యాటింగ్‌కు ఒక స్పష్టమైన టెంప్లేట్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. బెన్ డకెట్, జాకబ్ బెతెల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తీరు అసాధారణం. 20 నుంచి 30 ఓవర్ల వరకు ఎలాంటి అనవసర రిస్క్ తీసుకోకుండా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జో రూట్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో జోస్ బట్లర్ మెరుపు బ్యాటింగ్‌తో అద్భుతంగా ముగించాడు. ఇది మా జట్టు నుంచి వచ్చిన సంపూర్ణ బ్యాటింగ్ ప్రదర్శన’ అని వివరించాడు.
Also Read
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచిన జాకబ్ బెతెల్ బౌలింగ్‌పై కూడా బ్రూక్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో జరిగిన చర్చే ఆ నిర్ణయానికి కారణమని తెలిపాడు. ‘ఒక ఓవర్ తర్వాత నేను బయటకు వెళ్లి కోచ్ బాజ్ (బ్రెండన్ మెకల్లమ్)తో మాట్లాడాను. బెతెల్‌కు అవకాశం ఇచ్చి వరుసగా ఏడు లేదా ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయించు అని సూచించారు. ఆ నిర్ణయం మ్యాచ్‌లో చాలా కీలకంగా మారింది. కొంత ఒత్తిడి ఎదురైనా అందరూ ప్రణాళికకు కట్టుబడి పోరాడారు. చివరకు అదే మాకు విజయాన్ని అందించింది’ అని బ్రూక్ చెప్పాడు.
లార్డ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం చెలాయించారు. బెన్ డకెట్ సెంచరీ, జాకబ్ బెతెల్ కీలక ఇన్నింగ్స్, జో రూట్ అనుభవం, జోస్ బట్లర్ మెరుపు ఫినిషింగ్‌తో ఇంగ్లండ్ 387/3 భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌ను 360/7కే పరిమితం చేశారు. ఈ విజయంతో టీ20 సిరీస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో గెలిచి స్వదేశంలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు సిరీస్‌లు గెలవడంతో హ్యారీ బ్రూక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!