NTV Telugu Site icon

Harmanpreet Kaur: చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్.. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్

Harmanpreet World Record

Harmanpreet World Record

Harmanpreet Kaur Creates World Record: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్కరూ ఈ రికార్డ్ క్రియేట్ చేయలేదు. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ అరుదైన ఘనతను హర్మన్‌ తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు.. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ(148) రికార్డును కూడా హర్మన్‌ బద్దలు కొట్టింది. ఇప్పుడు 150 మ్యాచ్‌ల మైలురాయిని అందుకొని చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గానే హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇక హర్మన్‌ప్రీత్ తర్వాత మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా సుజీ బేట్స్‌ (143) రెండోస్థానంలోనూ, స్మృతి మందాన (115) మూడో స్థానంలోనూ నిలిచారు.

United Nations: ఉక్రెయిన్‌ vs రష్యా.. ఇప్పటివరకు 8వేల మంది పౌరులు బలి

ఇదిలావుండగా.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచెస్‌లో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లను మట్టికరిపించిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఓటమి పాలైంది. 11 పరుగుల తేడాతో ఆ మ్యాచ్ కోల్పోయింది. అయితే.. ఐర్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం భారత్ మళ్లీ సత్తా చాటింది. డక్‌వర్త్ ల్యూయిస్ పద్దతిలో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత 156 పరుగుల లక్ష్యంతో ఐర్లాండ్ బరిలోకి దిగగా.. 54/2 వద్ద వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో.. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. సెమీస్‌లో భారత్ ఏ జట్టుతో తలపడనుందన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

Virat Kohli: విరాట్ కోహ్లీకి లేడీ ఫ్యాన్ లిప్‌లాక్.. వీడియో వైరల్