NTV Telugu Site icon

Rohit Sharma Vs Hardik: ముంబైతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్

Hardik

Hardik

IPL 2024: ఐపీఎల్ 2024 మ్యాచ్లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. చివరి వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్ల ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians)పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు స్టేడియంలో అభిమానులు రోహిత్ శర్మ నామస్మరణ చేశారు. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ఈ సీజన్ కు టీమ్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను నియమించడంపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. దీంతో ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా నాయకత్వంలో రోహిత్ మైదానంలోకి వచ్చాడు.

Read Also: War 2: వార్ 2యాక్షన్ సీన్స్ కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా?

అయితే, మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. తొలుత రోహిత్ శర్మ స్లిప్ లో ఫీల్డింగ్ కు వెళ్లాడు.. కానీ, హార్దిక్ ఫీల్డింగ్ పొజిషన్ ను మార్చాలని సూచించడంతో.. రోహిత్ మరో స్థానానికి వెళ్లిపోయాడు.. అయితే, రోహిత్ ఎప్పుడూ స్లిప్ తో పాటు బ్యాటర్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేసేవాడు.. కానీ, హార్థిక్ పాండ్యా మాత్రం రోహిత్ ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయించడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రోహిత్ ను కావాలనే హార్దిక్ అవమాన పర్చాడంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Read Also: JNUSU Election : ఏబీవీపీకి షాక్.. జేఎన్‎యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎగిరిన లెఫ్ట్ జెండా

ఇక, రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు స్టేడియంలో రోహిత్ రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. హార్దిక్ పాండ్యా టాస్ కోసం వచ్చినప్పుడు కూడా స్టేడియంలో అభిమానులు అతన్ని హేళన చేస్తూ అరుపులు చేశారు. రోహిత్ శర్మ గ్రౌండ్ లో క్యాచ్ పట్టిన టైంలో నరేంద్ర మోడీ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. రోహిత్ శర్మ – హార్దిక్ పాండ్యా మధ్య విబేధాలు ఉన్నట్లు ఈ మ్యాచ్ లో స్పష్టంగా వెల్లడైంది. ఈ మ్యాచ్ లో ఓ సందర్భంలో బుమ్రా దగ్గరకు వెళ్లి రోహిత్ మాట్లాడుతుంటే హార్దిక్ పాండ్యా అసహనంతో వెళ్లిపోయాడు. అలాగే, మరోవైపు రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు రోహిత్ కెప్టెన్.. రోహిత్ కెప్టెన్ అంటూ అభిమానులు ప్లకార్డులతో స్టేడియంలో సందడి చేశారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు ఫోరు, సిక్సర్లతో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు.

Show comments