NTV Telugu Site icon

Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి

Wrestlers Protest

Wrestlers Protest

Harbhajan Singh Neeraj Chopra Sania Mirza Supports Wrestlers Protest: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటే.. రెజ్లర్లు గత ఆరు రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఈ నిరసనలో.. భజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌‌తో పాటు ఇతర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. వీరికి క్రీడాకారుల నుంచి విస్తృతస్థాయిలో మద్దతు లభిస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్‌, పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ వారికి సపోర్ట్‌గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చిన రెజ్లర్లు.. ఇలా రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని అన్నాడు. ‘‘సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగాట్‌లు భారతదేశానికి గర్వకారణం. అలాంటి రెజర్లు దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు.. ఓ క్రీడాకారుడిగా నేను బాధపడుతున్నాను. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Ravichandran Ashwin: అశ్విన్ అరుదైన ఘనత.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం

హర్భజన్‌తో పాటు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా కూడా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించాడు. న్యాయం కోసం రెజ్లర్లు వీధుల్లో ధ‌ర్నా చేయ‌డం త‌నను క‌లిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన నీరజ్.. రెజ్లర్ల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించి, నిర్ణయం తీసుకోవాలని కోరాడు. ‘‘దేశం త‌ర‌ఫున పోటీ ప‌డేందుకు మన అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. వాళ్లు దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రెజ్లర్లు.. న్యాయం కోసం వీధుల్లోకి రావడం కలచివేస్తోంది. ప్రతి పౌరుడి స‌మ‌గ్రత‌ను, మ‌ర్యాదను కాపాడే బాధ్యత మ‌న‌దే. ప్రస్తుతం జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు ఇంకెప్పుడూ జ‌ర‌గ‌కూడ‌దు. ఇది చాలా సున్నిత‌మైన అంశం కాబట్టి దీనిని పార‌ద‌ర్శకంగా, నిష్పాక్షికంగా ప‌రిష్కరించాలి. అధికారులు తక్షణమే స్పందించి, అథ్లెట్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరాడు. సానియా మీర్జా సైతం.. దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిన రెజ్లర్లకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని, వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సపోర్ట్‌గా నిలిచింది.

PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు

Show comments