ENG vs WI: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన ఈ యంగ్ ప్లేయర్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై ఒక్క సారిగా విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 103 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్‌ను అట్కిన్సన్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఆడిన అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 118 రన్స్ చేసి పెవిలియ్ బాట పట్టాడు.
Read Also: AP CM Chandrababu: ప్రకృతి విపత్తులు పోవాలంటే చెట్లు నాటడమే ఏకైక మార్గం
ఇక, ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరుపై లిఖించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ప్లేయర్ గా గస్ అట్కిన్సన్ నిలిచాడు. అయితే, అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీతో పాటు 10 వికెట్లు తీసిన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా గస్ అట్కిన్సన్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అట్కిన్సన్ తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ కూడా ఉన్నారు.
Read Also: Piyush Goyal: కంపెనీలు ఒకదానికొకటి సపోర్టుగా ఉండాలి..
లార్డ్స్ మైదానంలో 8వ స్ధానంలో సెంచరీలు చేసినంది వీరే..
స్టువర్ట్ బ్రాడ్ (169, ఇంగ్లండ్)
గుబ్బి అలెన్ (122, ఇంగ్లండ్ )
బెర్నార్డ్ జూలియన్ ( 121, వెస్టిండీస్)
గస్ అట్కిన్సన్ ( 118, ఇంగ్లండ్)
రే ఇల్లింగ్ వర్త్ (113, ఇంగ్లండ్)
అజిత్ అగార్కర్ (109, భారత్)
He's done it! 💪
Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2
— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024