NTV Telugu Site icon

Gautam Gambhir: ‘ఆట మార్చుకో’.. ఇషాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్

Gau

Gau

ఇషాన్ కిషన్..టీమిండియా భవిష్యత్ స్టార్‌గా ముందుకు సాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో చూపాడు. అయితే టీ20ల్లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ నిరాశపరుస్తున్నాడు. రెండో టీ20లో ఇండియా గెలిచినా.. ఇషాన్ మాత్రం కేవలం 4 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. భారీ షాట్లు ఆడటం సులువే కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకోవాలని సూచించాడు. అలాగే ఇషాన్ స్పిన్ బౌలింగ్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

Fire On Birthday Party: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

“ఇషాన్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అతడొక్కడే కాదు ఈ మ్యాచ్‌లో మొత్తం ఇండియన్ బ్యాటింగ్ యూనిట్ స్పిన్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడింది. కాస్త తెలివితో ఆడే సామర్థ్యం లేదు. పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టడం సులువే కానీ.. స్ట్రైక్‌ను రొటేట్ చేసే సామర్థ్యం ఉండాలి. ఈ పిచ్‌పై స్పిన్‌కు సహకారం లభించింది. ఇషాన్‌కు బ్రేస్‌వెల్‌తో బౌలింగ్ చేయించడమే అందుకు నిదర్శనం. ఈ యువ ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడాన్ని త్వరగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వికెట్ పై ముందుకు దూసుకొచ్చి భారీ సిక్స్‌లు కొట్టడం సాధ్యం కాదు. బంగ్లాదేశ్‌లో ఆ డబుల్ సెంచరీ తర్వాత అతని ఆటతీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ తర్వాత అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని అందరూ భావించారు” అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

IND vs NZ: ఇవేం పిచ్‌లు.. మరీ ఇంత చెత్తగా ఉన్నాయ్: హార్దిక్

ఇక స్పిన్ బౌలింగ్‌ను కూడా ఇషాన్ సరిగ్గా ఆడలేకపోతున్నాడని గంభీర్ అన్నాడు. “స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంపై ఇషాన్ చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ తొలి 6 ఓవర్లలోనే అతనిపై స్పిన్‌ను ప్రయోగిస్తారు. పేస్ బౌలింగ్‌ను అతడు బాగానే ఆడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఆడటం ఎంత త్వరగా నేర్చుకుంటే అతనికి అంత మంచిది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో..” అని గంభీర్ సూచించాడు.