Gambhir Vs Pitch Curator: హలో మాస్టారు మాకు కూడా రూల్స్ తెలుసండి.. ఓవల్ పిచ్ క్యూరేటర్పై గంభీర్, గిల్ గరం..!
- భారత్- ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన..
- టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం..
- ఓవల్ పిచ్ క్యూరేటర్పై తీవ్రంగా మండిపడిన కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా కెప్టెన్ గిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambhir Vs Pitch Curator: భారత్- ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం వద్దకి వచ్చిన లీ ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు. లీ మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకు రావడంతో.. పిచ్ క్యూరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా ఈ వివాదంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రియాక్ట్ అయ్యాడు. క్యూరేటర్ ఫోర్టిస్‌పై మండిపడ్డాడు.
Read Also: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నా కెరీర్లో చాలా మ్యాచ్‌లు ఆడాను.. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటి వరకు ఏ క్యూరేటర్ కూడా మాకు చెప్పలేదని టీమిండియా సారథి గిల్ పేర్కొన్నాడు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్ (చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది.. మాకు అన్ని రూల్స్ తెలుసు.. ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకుంటే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకునే అవకాశం ఉంది.. కానీ, మేము అలాంటి షూలను ధరించలేదు.. అయినా కూడా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో తెలియడం లేదన్నారు. మేము ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాం.. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కెప్టెన్ వెల్లడించారు. కాగా ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి ఓవల్ స్టేడియం వేదికగా స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే.. ఇంగ్లాండ్ మాత్రం ఎలాగైనా గిల్ సేనను ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.
Gautam Gambhir in a heated argument with Oval’s chief curator Lee Fortis
India Batting coach called it “odd” as the groundsman asked them to stay 2.5m away from the pitch.
Meanwhile England coach McCullum stood right on it! 🤔 #INDvsENG #GautamGambhir #ENGvsIND #groundsman pic.twitter.com/ivn4fSOIOI— GyanGainer (@techind34820937) July 30, 2025
STRONG STATEMENT BY CAPTAIN GILL FOR BACKING HIS COACH FOR THE INCIDENT WITH PITCH CURATOR…!!! 🔥 pic.twitter.com/DJ4pOVD8SM
— Johns. (@CricCrazyJohns) July 30, 2025
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!