NTV Telugu Site icon

French Open 2022: ముగిసిన బోపన్న పోరాటం..సెమీస్‌లో ఓటమి

Rohan Bopanna Matwe Middelkoop

Rohan Bopanna Matwe Middelkoop

పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్‌ మార్సెలో అరివలో–జీన్‌ జులియెన్‌ రోజర్‌ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్‌ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్‌–డచ్‌ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు.

2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్‌ చేజిక్కించుకుంది. కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్‌ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌ దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్‌ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న..ఐజముల్‌ హక్‌ ఖురేషీ తో కలిసి 2010 US ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.