Site icon NTV Telugu

అమీర్‌ సారీ చెప్పాలి: పాక్‌ క్రికెటర్‌

క్రికెట్‌ అంటే ఎంతో అభిమానం ఉన్న దిగ్గజ క్రికెటర్లు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఏదో ఒక ఘర్షణ వాతావరణానికి కారణం అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే సోషల్‌ మీడియాలో .. భారత్‌, పాక్‌ మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ అమీర్‌ ట్విట్టర్‌ వార్‌పై పాక్‌ మాజీ స్పిన్నర్‌ సయ్యద్‌ అజ్మల్‌ స్పందించాడు.

“షోయబ్‌ అక్తర్‌, హర్భజన్‌ మధ్య జరగుతున్న చర్చలోకి అమీర్‌ దూరడం తప్పు. అనీ అందుకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఇద్దరూ గొప్ప ఆటగాళ్ల మధ్యన చర్చ జరుగుతున్నప్పుడు సంయమనం పాటించాలి. అమీర్ కలగజేసు కోవడం సరైన నిర్ణయం కాదని అజ్మల్‌ మండిపడ్డాడు. ఇప్పటికైనా అమీర్‌ జాగ్రత్తగా ఉండా లని, గొప్ప వాళ్ల మధ్యన చర్చ జరుగుతు న్నప్పుడు సహనంతో ఉండాలని మధ్యలో దూరడం సరైనది కాదని సయ్యద్‌ అజ్మల్‌ అన్నాడు.

Exit mobile version