పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్ మెన్ ఇంజమామ్ కు గుండె పోటు వచ్చింది. ఈ నేపథ్యం లో మాజీ కెప్టెన్ ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్చారు. సోమ వారం సాయంత్రం పూట ఇంజమామ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే… ఆయనను ఆస్పత్రి కి తరలించారు కుటుంబ సభ్యులు.
ఇక ఆస్పత్రి లో చేరిన ఇంజమామ్ కు…. తాజాగా యాంజియోప్లాస్టి సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు వైద్యులు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వైద్యుల ప్రకటన తో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అటు ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితిపై విచారం వ్యక్తం చేసింది పాక్ క్రికెట్ బోర్డు.
