NTV Telugu Site icon

తోటి ఆట‌గాడిని ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయిన డు ప్లెసిస్‌

దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆటగాడు ఫాఫ్‌ డు ప్లెసిస్‌ బౌండరీ లైన్‌ దగ్గర మరో ఆటగాడు మహమ్మద్‌ హస్‌నెయిన్‌ను గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హసనెయిన్‌ మోకాలు డు ప్లెసిస్‌ త‌ల‌కి బలంగా తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆసుప‌త్రిలో ఆయ‌నకు స్కానింగ్ తీసిన వైద్యులు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.