Site icon NTV Telugu

IPL: ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్‌… వెల్లడించిన కోహ్లీ

ఐపీఎల్‌లో రాయల్​ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన విరాట్‌ కోహ్లీ.. ఐపీఎల్‌ 2021 ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఐపీఎల్ 2022 సీజన్‌కు కెప్టెన్‌ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓ దశలో మళ్లీ విరాట్‌ కోహ్లీకే బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా సాగింది.. అయితే, ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ ఎవరు…? అనే ఉత్కంఠకు తెరపడింది.. సౌతాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌ ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించారు.. బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ ఆన్‌బాక్స్‌ ఈవెంట్‌లోఈ విషయాన్ని వెల్లడించింది బెంగళూరు ఫ్రాంచైజీ.. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్​కోహ్లీ వీడియో సందేశం ద్వారా సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. డుప్లెసిస్​కెప్టెన్సీలో ఆడనుండటంపై కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు కోహ్లీ..

Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. పార్టీకి కీలక నేత గుడ్‌బై..

కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో డుప్లెసిస్‌ను రూ. 7కోట్లకు సొంతం చేసుకుంది ఆర్సీబీ యాజమాన్యం.. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు ఆడిన డుప్లెసిస్‌ అద్భుతంగా రాణించి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌ ఇచ్చాడు.. గత ఐపీఎల్‌ సీజన్‌లో 633 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఇక, ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో అడుగుపెడుతూనే.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు.

https://twitter.com/RCBTweets/status/1502606075198988292
Exit mobile version