NTV Telugu Site icon

భారత్-ఇంగ్లాండ్ : రెండో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌ కలకలం

లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ జిడ్డు బ్యాటింగ్‌ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడానికి ఇబ్బందిపడ్డ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు… బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి… బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కి… ఆకారాన్ని మార్చే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మొహాలు కనిపించకపోవడంతో టాంపరింగ్‌ చేసిన ఆటగాళ్లు ఎవరనేది గుర్తించలేని పరిస్థితి నెలకొంది.