Site icon NTV Telugu

లీడ్స్‌ టెస్ట్‌ : 432 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

లీడ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ లో ఇంగ్లండ్‌ జట్టు 432 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా భారత జట్టు పై తొలి ఇన్నింగ్స్‌ లో 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఇంగ్లండ్‌ టీం. ఇక మూడో రోజు 8 వికెట్ల నష్టానికి 423 పరుగులకు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. మరో 9 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వివరాల్లోకి వెళితే… రూట్‌ 121 పరుగులు, బర్న్స్‌ 61 పరుగులు, హసీద్‌ హమీద్‌ 68 పరుగులు, డేవిడ్‌ మిలాన్‌ 70 పరుగులు చేసి ఇంగ్లండ్‌ జట్టుకు భారీ స్కోర్‌ ను అందించారు. అటు ఇండియా బౌలింగ్‌ విషయానికి వస్తే… షమీ 4 వికెట్లు, సిరాజ్‌ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇక మరికాసేపట్లోనే టీం ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌ లో 78 పరుగులకే ఇండియా అలౌటైన సంగతి తెలిసిందే.

Exit mobile version