NTV Telugu Site icon

టాస్ పడకుండానే ముగిసిన మొదటి సెషన్…

భారత్ – న్యూజిలాండ్ మధ్య ఈ రోజు ముంబైలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ మొదటి రోజులో మొదటి సెషన్ ముగిసిపోయింది. అయితే ముంబైలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అక్కడ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ ఇంకా తడిగానే ఉంది. దాంతో టాస్ ను మొదట ఓ గంట సేపు వాయిదా వేశారు అంపైర్లు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో మొదటి సెషన్ ను కొంచెం త్వరగా ముగించి ఆటగాళ్లకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ బ్రేక్ ముగిసిన తర్వాత రెండో సెషన్ లో టాస్ వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె… రెండు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. భారత జట్టులో రహానే, జడేజా, ఇషాంత్ శర్మ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు ఈ మ్యాచ్ కు దూరం కాగా.. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ మిస్ అవుతున్నాడు.