NTV Telugu Site icon

పారాలింపిక్స్‌ : ఇండియ‌న్ అథ్లెట్ వినోద్ కుమార్‌కు షాక్

పారాలింపిక్స్‌లో ఇండియ‌న్ అథ్లెట్ వినోద్ కుమార్‌కు షాక్ త‌గిలింది. డిస్క‌స్ త్రో ఎఫ్‌-52 క్లాస్‌లో అత‌డు గెలిచిన‌ బ్రాంజ్ మెడ‌ల్‌ను కోల్పోయాడు. టోక్యో పారాలింపిక్స్ టెక్నిక‌ల్ క‌మిటీ అధికారులు.. వినోద్‌ను ఎఫ్‌-52 క్లాస్ డిస్క‌స్‌కు అనర్హుడిగా తేల్చారు. దీంతో ఈ కాంపిటిష‌న్‌లో అత‌డు సాధించిన ఫ‌లితాన్ని ర‌ద్దు చేయ‌డంతో బ్రాంజ్ మెడ‌ల్ కోల్పోయాడు. పారా అథ్లెట్ల‌ను వాళ్ల వైక‌ల్యం ర‌కం, దాని తీవ్ర‌త‌ను బ‌ట్టి వ‌ర్గీక‌రిస్తారు. వాళ్ల స్థాయిలోనే వైక‌ల్యం ఉన్న ఇత‌ర అథ్లెట్ల‌తో పోటీ ప‌డేందుకు వీలుగా ఇలా చేస్తారు. సాధార‌ణంగా వెన్నెముక‌కు గాయ‌మైన అథ్లెట్లు ఇలాంటి కేట‌గిరీలో ఉంటారు.