Site icon NTV Telugu

IPL 2022: మూడేళ్ల తర్వాత ధోనీ హాఫ్ సెంచరీ.. చెన్నై స్కోరు ఎంతంటే..?

ఐపీఎల్-15లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత తడబడింది. అయితే ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అసలు 120 పరుగులన్నా చెన్నై చేస్తుందా అని సందేహాలు కలిగిన వేళ.. ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. ధోనీ (50 నాటౌట్), జడేజా (26 నాటౌట్) భాగస్వామ్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 132 పరుగుల టార్గెట్ నిలిచింది.

కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రసెల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. కాగా ధోనీ చివరగా 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో దాదాపు మూడేళ్ల తర్వాత ధోనీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. కెప్టెన్‌గా తప్పుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ తన మార్క్ చూపించాడంటూ చెన్నై అభిమానులు సంబరపడుతున్నారు.

https://ntvtelugu.com/rcb-may-not-qualify-for-play-offs-this-year-says-by-akash-chopra/
Exit mobile version