Site icon NTV Telugu

DPL Players Fight: డీపీఎల్లో ఉద్రిక్తత.. స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..!

Dpl

Dpl

DPL Players Fight: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు ఎక్కువ దూకుడుగా కనిపిస్తుంటారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ మాత్రం అగ్రెసివ్ గా ఉండటం సహజమే. ఇక, లీగ్‌ల విషయాని వస్తే.. ఇక్కడ మొత్తం కమర్షియల్.. గెలుపు కోసం చూస్తారే తప్పా గొడవలకు దిగడం చాలా తక్కువ.. కానీ, దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల ప్లేయర్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా, ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకానొక దశలో ఆటగాళ్లు కొట్టుకొనే వరకూ వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Read Also: Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!

అయితే, డీపీఎల్ 2025 నాకౌట్‌ దశకు చేరుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ కొనసాగింది.. మొదట సౌత్ ఢిల్లీ బ్యాటింగ్‌కు వచ్చి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన వెస్ట్ ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్‌ తగిలింది. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక, ఓపెనర్‌ క్రిష్‌ యాదవ్‌ (31), మయాంక్‌ గుసైన్ (15*)తో కలిసి నితీశ్‌ (134*: 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్‌లు)తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచారు. క్రిష్‌ – నితీశ్‌ కలిసి 3 వికెట్‌కు 98 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

Read Also: Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు

ఇక, నితీశ్‌ – క్రిష్‌ జోడీ మరింత దూకుడుగా ఆడుతున్న సమయంలో సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలికి క్రిష్‌ యాదవ్ భారీ సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్‌ వద్ద అన్‌మోల్‌ శర్మ చేతికి చిక్కాడు. అప్పుడే బౌలర్ – బ్యాటర్‌ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.. ఒకరినొకరు తొసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వారిని సహచర ఆటగాళ్ల ఆపేందుకు ప్రయత్నించారు. కీలక వికెట్‌ పడటంతో సౌత్ ఢిల్లీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో.. డగౌట్‌కు వెళ్తున్న క్రిష్‌ యాదవ్‌ ఏవో కామెంట్స్ చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కొట్టుకోవడంతో అంపైర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version