Site icon NTV Telugu

IPL 2022: చెత్తగా ఓడిన పంజాబ్.. ఢిల్లీకి ముచ్చటగా మూడో విజయం

Delhi Capitals

Delhi Capitals

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 115 పరుగులకే ఆలౌటైంది. జితేష్ శర్మ (32), మయాంక్ అగర్వాల్ (24) టాప్ స్కోరర్లు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

అనంతరం పంజాబ్ నిర్దేశించిన 116 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పృథ్వీషా 20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 60 పరుగులు చేసి తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. పృథ్వీ షా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (12) అండగా వార్నర్ మిగతా పని పూర్తి చేశాడు. టోర్నీలో ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది మూడో విజయం. అటు పంజాబ్‌కు ఇది నాలుగో పరాజయం.

IPL 2022: పేలవ ఫామ్‌లో విరాట్ కోహ్లీ.. అతడి ఆటతీరుపై పేలుతున్న మీమ్స్

Exit mobile version