ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్‌లో 50వ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అందరూ అనుకున్నట్లే ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పాత టీమ్ సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుతిరిగినా వార్నర్ మాత్రం కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు.
మరో ఆటగాడు పావెల్ కూడా ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో పావెల్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నాడు. అతడు వార్నర్‌కు బ్యాటింగ్ ఇచ్చి ఉంటే సెంచరీ పూర్తయ్యేది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో ఓ మెయిడిన్ ఓవర్ సహా 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సన్‌రైజర్స్ టీమ్ 208 పరుగులు చేయాల్సి ఉంది.
