Site icon NTV Telugu

World Championship 2024: చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ..

Deepthi

Deepthi

India’s first ever gold in track events at World Para Athletics Championships: కోబె (జపాన్), మే 20 సోమవారం ఇక్కడ జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీ రేసులో భారత్‌కు చెందిన దీప్తి జీవన్‌జీ 55.07 సెకన్లలో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో, జీవన్‌జీ మహిళల 400 మీటర్ల టీ20 హీట్‌లో 56.18 సెకన్లతో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత ఏడాది పారిస్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును “దీప్తి” బద్దలు కొట్టింది. నాలుగో రోజు పోటీల్లో టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ 55.19 సెకన్లతో రెండో స్థానంలో ఉండగా, ఈక్వెడార్‌కు చెందిన లిజాన్‌షెలా అంగులో 56.68 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు.

Also Read; SIT Team: ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు..

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ ఈవెంట్‌లలో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. అంతకుముందు పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2024లో, మహిళల 200 మీటర్ల T35 విభాగంలో భారతదేశానికి చెందిన ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల ఎఫ్56 విభాగంలో డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా 41.80 మీటర్లు ఎగసి రజతం సాధించాడు. ఆదివారం నిషాద్ కుమార్ (టీ47 హైజంప్) లో కాంస్యని గెలుపొందాడు. దీనితో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు పొందారు. ఇక ఈ ఛాంపియన్‌షిప్‌లు మే 25 వరకు కొనసాగుతాయి.

Exit mobile version