ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు గుప్పించాడు సౌతాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్. ఈ ఏడాది ఐపీఎల్ కు రాకూడదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అలాగే ఇంతలా దేశంలో నిర్వహిస్తున్న లీగ్స్ లో ఆడటం మేలన్నాడు స్టెయిన్.
ఐపీఎల్‌లో ఎంత డబ్బు సంపాదించారన్నదే చూస్తారని.. ఒక్కోసారి అసలు క్రికెట్ గురించి మరచిపోతారని హాట్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ కంటే ఇతర లీగ్స్‌లో ఆడటం ఓ ప్లేయర్‌గా నాకు ఉపకరిస్తుందన్నాడు డేల్ స్టెయిన్. ప్రస్తుతం అతడు పీఎస్ఎల్ ఆరో సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ పై స్టెయిన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు భారత అభిమానులు.