CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్‌కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!

Csk Retained And Released Players List

Csk Retained And Released Players List

CSK Retained and Released Players List for IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీలక ప్రకటన చేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితాను వెల్లడించిన సీఎస్‌కే.. జట్టులో పలు మార్పులు చేపట్టింది. ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రియాశీల ఆటగాడిగా తప్పుకోవడమే. ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఇకపై జట్టు మెంటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో సీఎస్‌కే అభిమానులకు ఇది భావోద్వేగమైన పరిణామంగా మారింది.

ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే సీజన్‌కు జట్టును సిద్ధం చేసే క్రమంలో పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. దిగ్గజం ఎంఎస్ ధోనీతో పాటు ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ, మ్యాథ్యూ షార్ట్, జకరీ ఫౌల్క్స్, మాక్‌నీల్ నొరోన్హా, అమన్ ఖాన్, ఆకాశ్ మధ్వాల్, కుల్దీప్ యాదవ్, డియాన్ ఫారెస్టర్‌లను జట్టు నుంచి తప్పించింది. ట్రేడ్ల ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరు డేంజర్ ప్లేయర్స్ వచ్చే సీజన్‌లో చెన్నై తరఫున ఆడనున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్‌స్టోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. మొదటి బంతి నుంచే విరుచుకుపడుతాడు. అవసరం అయితే స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ ఎడ్వర్డ్స్‌ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతాడు. మరోవైపు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంపించింది.

సీఎస్‌కే తన ప్రధాన ఆటగాళ్లను కొనసాగించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సంజు శాంసన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్ జట్టులో కొనసాగనున్నారు. అఖీల్ హొసేన్, అన్షుల్ కాంబోజ్, ఆయుష్ మాత్రే, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్, కార్తీక్ శర్మ, ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, రామకృష్ణ ఘోష్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ గోపాల్, ఉర్విల్ పటేల్ కూడా జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సీఎస్‌కే వద్ద రూ.28.05 కోట్ల పర్స్ మిగిలి ఉంది. జట్టులో మొత్తం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా.. వాటిలో రెండు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. ఈ మొత్తంతో వేలంలో అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోంది.

సీఎస్‌కే రిటెన్షన్, రిలీజ్ వివరాలు:
రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్: ఎంఎస్ ధోనీ (ఆటగాడిగా రిటైర్మెంట్), ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ, మ్యాథ్యూ షార్ట్, జకరీ ఫౌల్క్స్, మాక్‌నీల్ నొరోన్హా, అమన్ ఖాన్, ఆకాశ్ మధ్వాల్, కుల్దీప్ యాదవ్, డియాన్ ఫారెస్టర్.

రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, అఖీల్ హొసేన్, అన్షుల్ కాంబోజ్, ఆయుష్ మాత్రే, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్, కార్తీక్ శర్మ, ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, రామకృష్ణ ఘోష్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ గోపాల్, ఉర్విల్ పటేల్.

ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చిన ప్లేయర్స్: లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్.

ట్రేడ్ ద్వారా బయటకు వెళ్లిన ప్లేయర్స్: ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్.

మిగిలిన పర్స్: రూ.28.05 కోట్లు
ఖాళీ స్థానాలు: 6 (విదేశీ ఆటగాళ్ల స్థానాలు 2)