Site icon NTV Telugu

వైఎస్ జగన్‌‌తో అనిల్‌ కుంబ్లే భేటీ.. కారణం ఇదేనా?

టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఫ్రేమ్ ను అందించారు. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు. ఈ మీటింగ్ మర్యాదపూర్వకంగా అని చెబుతున్నా.. కానీ కుంబ్లే ఆంధ్రలో క్రికెట్ అకాడమీ మొదలుపెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. దానికోసమే జగన్ ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు తన సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు క్రీడా పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ప్రయత్నించాలని సీఎం జగన్ కు ఆయన సలహా ఇచ్చారని సమాచారం.

Exit mobile version