నిన్న ఉత్కంఠ భరితంగా జరిగిన INDvsNZ మ్యాచ్‌లో రోహిత్ ఒక తప్పు చేశాడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్ చేయించకపోవడం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు.
ప్రారంభంలోనే కివీస్ వికెట్ కోల్పోయి తడబడిన వేళ వెంకటేశ్‌తో రెండు, మూడు ఓవర్లు వేయించాల్సి ఉందన్నారు. దీపక్, సిరాజ్ ఓవర్లలో ఎక్కువ పరుగులు వచ్చాయన్నారు. అలాంటి సమయంలో చేతిలో ఉన్న వెంకటేష్ అయ్యర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉన్న రోహిత్ ఉపయోగించుకోలేదని, అలా చేయకపోవడం వల్ల రోహిత్ అరుదైన తప్పిదం చేసినట్టు అయిందని ఆకాష్ అన్నారు.
