Site icon NTV Telugu

నాకు దాని బాధ లేదంటున్న పుజారా…

రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టెస్టులో భారత జట్టుకు కీలకమైన ఆటగాళ్లలో పుజారా ఒక్కడు. కానీ 2019 లో ఆస్ట్రేలియా పై అదరగొట్టిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రదర్శన చేయలేదు. అలాగే ఆ సిరీస్ లో 3 సెంచరీలు చేసిన అతను మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేదు. అంటే పుజారా తన ఆఖరి శతకం చేసి మూడు సంవత్సరాలు కావస్తుంది.

కానీ అది తన పై ఎటువంటి ఒత్తిడి తేలేదు అని అంటున్నాడు పుజారా. నేను జట్టుకు సహకారం అందిస్తున్నంత కాలం సెంచరీ చేయడం గురించి బాధపడనని పుజారా చెప్పాడు. సెంచరీ అనేది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. కానీ జట్టులో నా పని బ్యాటింగ్ చేయడం. పరుగులు సాధించడం. నేను 80లు మరియు 90లు చేస్తున్నాను. కాబట్టి నా బ్యాటింగ్ జట్టుకు సహకరిస్తున్నంత కాలం నేను సెంచరీ గురించి బాధపడను. అయితే అది ఒక్క ఇన్నింగ్స్‌ కు సంబంధించిన విషయం అన్నారు. కాన్పూర్‌లో జరగనున్న మొదటి టెస్టుకు పుజారా వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్న విషయం తెలిసిందే.

Exit mobile version