Site icon NTV Telugu

IPL 2022: టాస్ గెలిచిన జడేజా టీమ్.. చెన్నై బోణీ కొట్టేనా..?

Csk Match Min

Csk Match Min

ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్‌లోకి అడుగుపెట్టిన ఆ టీమ్‌కు వరుస పరాజయాలు షాకిచ్చాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో జడేజా నేతృత్వంలోని జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. కాగా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు.

తుది జట్ల వివరాలు:

చెన్నై జట్టు: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోనీ, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి

పంజాబ్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భనూక రాజపక్స, లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, ఒడియాన్ స్మిత్, అర్షదీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా

Exit mobile version