Site icon NTV Telugu

SRH vs CSK: చితక్కొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Csk 10 Overs Innings

Csk 10 Overs Innings

Chennai Super Kings Scored 86 In First 10 Overs: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా తొలి 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. చెన్నై విజయం సాధించాలంటే.. మరో 10 ఓవర్లలో 49 స్కోరు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం చిన్నదే కావడంతో.. చెన్నై ఓపెనర్లు హడావుడిగా ఆడట్లేదు. ఆచితూచి ఆడుతూ.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా.. పవర్ ప్లేలో అదరగొట్టేశారు. ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసే సమయానికి 61 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే ముగిసినప్పటి నుంచి అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా.. జాగ్రత్తగా రాణిస్తున్నారు.

Pawan Kalyan: ముద్దుల మేనల్లుడును కూడా అలా పిలవాలా.. పవన్

ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 50 పరుగులు చేశాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్న ఇతను.. పవర్ ప్లే అనంతరం కాస్త నెమ్మదించాడు. ఏ పిచ్‌లో అయితే సన్‌రైజర్స్ బ్యాటర్లు స్కోరు చేసేందుకు తంటాలు పడ్డారో, అదే పిచ్‌లో చెన్నై ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అటు.. రుతురాజ్ గైక్వాడ్ నిదానంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సహకారంతో 34 పరుగులు చేశాడు. వీళ్లిద్దరు ఆటతీరు చూస్తుంటే.. ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేధించేలా కనిపిస్తున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు వికెట్ తీసేందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు. వికెట్ల లోపలికి దూసుకెళ్తున్న బంతుల్ని అడ్డుకుంటున్న ఈ ఆటగాళ్లు.. షాట్ బంతులకు టెంప్ట్ అవ్వకుండా, చాలా చక్కగా ఆడుతున్నారు.

Exit mobile version