NTV Telugu Site icon

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ నుంచి షార్లెట్ డుజార్డిన్ నిష్క్రమణ

Parisolympics

Parisolympics

నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మూడు సార్లు బంగారు పతకాన్ని సాధించిన బ్రిటీష్ ఒలింపియన్ షార్లెట్ డుజార్డిన్ 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె చర్యల పట్ల ఎఫ్‌ఈఐ  యాక్షన్ తీసుకుంది.

నాలుగు సంవత్సరాల క్రితం ఆమె శిక్షణా కేంద్రంలో డుజార్డన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విచారణకు గురైంది. ఈ పరిణామాలతో ఆమె తాత్కాలికంగా సస్పెండ్‌కు గురైంది. నెట్టింట వీడియో వైరల్ కావడంతో ఆమె తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. క్షమాపణ కూడా చెప్పింది. తప్పు జరిగినట్లుగా ఆమె అంగీకరించింది.

షార్లెట్ డుజార్డిన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దెబ్బలు తాళలేక గుర్రం తప్పించుకునే ప్రయత్నం చేసింది. కొరడా దెబ్బల నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినా.. కొడుతూనే ఉంది. ఆమె చర్యలను ఎఫ్‌ఈఐ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో ఆమెను జాతీయ, అంతర్జాతీయ ఈవెంటల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

షార్లెట్ డుజార్డిన్(39).. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకుంది. 2016లో మరొక స్వర్ణం సాధించింది. 2021 టోక్యో ఒలింపిక్స్ నుంచి రెండు కాంస్యలతో సహా మొత్తం ఆరు ఒలింపిక్ పతకాలను సాధించింది.